1
మేఘాల మీద యేసు
వచ్చుచున్నాడు
పరిశుద్ధులందరిని-తీసుకుపోతాడు
లోకమంతా శ్రమకాలం
విడువబడుట బహు ఘోరం ||యేసు||
2
ఏడేండ్లు పరిశుద్ధులకు విందౌబోతుంది
ఏడేండ్లు లోకం మీదికి
శ్రమరాబోతుంది
ఈ సువార్త మూయబడున్‌
వాక్యమే కరువగును ||యేసు||
3
వెయ్యేండ్లు యిలపై యేసు
రాజ్యమేలును
ఈ లోక రాజ్యములన్ని
ఆయన యేలును
నీతి శాంతి వర్ధిల్లున్‌
న్యాయమే కనబడును ||యేసు||
4
ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించి
గడగడలాడును
వంగనీ మోకాళ్ళన్నీ
యేసయ్య ఎదుట వంగిపోవును ||యేసు||
5
క్రైస్తవుడా మరువవద్దు
ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్థనచేయి
సిద్ధముగా నుండి
రెప్పపాటున మారాలి
యేసయ్య చెంతకు చేరాలి ||యేసు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)