1
ప్రయాసపడి భారము మోయువారిని
అతి ప్రేమతో ఆహ్వానింతుము
పాప భారమెల్ల ప్రభువు
మనో దుఃఖముల సర్వాధికారముతో
మోసి తీర్చెను ||దాసు||
2
ఆకలి వ్యాధులు గలవారికి
ప్రేమతో సాయము జేసెదం
ఉచితముగ మేళ్లతో నిండి
తనను తానే మరచి యేసు
ఓర్పుతో తిరిగెన్‌ ||దాసు||
3
ఇరుకులు ఇబ్బందులు గలవారిని
నీచులన్‌ ఘనులుగ మార్చెదం
సహించలేని కష్టములలో
నిష్ఠూరములలో అగాధ గోతిలో
పడినవారిని ||దాసు||
4
హిందూదేశ స్త్రీ పురుషులను
వింత వెలుగునకు మార్చెదం
సుందర సుగుణ శీలుఁడై
అధిక జ్ఞానుండై బంధంబుల్‌ దెంచి
ప్రవర్థమానుండై ||దాసు||
5
మార్గము తప్పి నడుచువారిని
సత్య మార్గములో చేర్చెదం
పట్టుతో ప్రార్థన చేతుము
ఆరాధింతుము సేవను జేతుము
జయమొందెదం ||దాసు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)