1
నీ పాపంబులన్నియు - క్షమియించి
మరచి నీ పాపంబులన్నియు
నాశనకరంబైన వ్యాధిన్‌ తొలగించె (2)
పృధివిన్‌ చూపిన ఇట్టి ప్రేమ నెంచి
2
ఎంత కృప జూపెను-నీ బ్రతుకునందు
ఎంత కృప జూపెను
నిత్యము-నీ తలపై కిరీటముంచి (2)
చావకుండ నీదు ప్రాణంబున్‌ కాపాడె
3
మేలుతో - నీ నోటిని
తృప్తి పరచెను మేలుతో - నీ నోటిని
పక్షిరాజువలె నీదు యౌవనమున్‌ (2)
క్రొత్తదగుచుండు నట్లుగ జేసెను
4
భూమికి - ఆకాశము - యెంత
దూరమున్నదో భూమికి - ఆకాశము
ఆయన-యందు-భయభక్తులున్నట్టి(2)
వారియెడ నంత - కృపనధికంబు
5
మన్నింపు మహిమయు
మన దేవుడిచ్చును మన్నింపు
మహిమయు
తూర్పునకు-పడమరకెంత దూరమో(2)
నీ పాపంబులట్లు దూరంబు జేసెగా
6
తండ్రి జాలి పడడా?
తన పిల్లలయందు తండ్రి జాలి పడడా?
నీవు రక్షకుని - నమ్ముకొనినచో (2)
ముదిమి వరకు - నిన్నెత్తి కొనును

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)