1
ప్రభువా తరతరములనుండి
మాకు నివాస స్థలము నీవే
యుగయుగములకును నీవే
మా దేవుడవు,
దేవుడవు, దేవుడవు, దేవుడవు.
2
పర్వతములు పుట్టకమునుపు
భూమిని లోకమును నీవు
పుట్టింపక మునుపు గూడ
నున్నావు, నున్నావు,
నున్నావు, నున్నావు ||ప్రభు||
3
నరపుత్రులను మంటికి మార్చి
తిరిగి రండని సెలవిచ్చెదవు
వేయి సంవత్సరములు నీకొక
జామువలె, జామువలె,
జామువలె, జామువలె ||ప్రభు||
4
నీదు దృష్టికి వేయి యేండ్లు
గతించిన నిన్నటివలె నున్నవి
రాత్రియందొక జాముకు సమముగ
నున్నవి, నున్నవి,
నున్నవి, నున్నవి ||ప్రభు||
5
నీవు వారిని పారగొట్టగ
వరద చేతనైన రీతి
గడ్డివలె చిగిరించి వాడి
పోయెదరు, పోయెదరు,
పోయెదరు, పోయెదరు. ||ప్రభు||
6
ప్రొద్దుట మొలచి చిగిరించును
సాయంత్రమున కోయబడును
వాడబారును నీ కోపముచే
క్షీణించున్‌, క్షీణించున్‌,
క్షీణించున్‌, క్షీణించున్‌ ||ప్రభు||
7
నీదు కోపము వలన మేము
క్షీణించుచున్నాము దేవా
నీ ఉగ్రతను బట్టి దిగులు
పొందెదము, పొందెదము,
పొందెదము, పొందెదము ||ప్రభు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)