1
అద్భుత కరుడా ఆలోచన
ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహు ప్రియుడా
మనోహరుడా మహిమ రాజా
స్తుతించెదన్‌ ||నా ఆత్మ||
2
విమోచన గానములతో
సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్‌
హర్షింతును నే పాడెదను
నా ప్రభువా ||నా ఆత్మ||
3
గర్భమున పుట్టిన బిడ్డను
కరుణింపక తల్లి మరచునా
మరచిన గాని నీ వెన్నడు
మరువవు విడువవు ఎడబాయవు
కరుణరాజా ||నా ఆత్మ||
4
రక్షణాలంకారములను
అక్షయమగు నీ యాహారమున్‌
రక్షకుడా నా కొసగితివి
దీక్షతో నిన్ను వీక్షించుచు
స్తుతింతును ||నా ఆత్మ||
5
నీ నీతిని నీ రక్షణను
నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞతా స్తుతుల తోడ
నీ ప్రేమను నే వివరింతును
విమోచకా ||నా ఆత్మ||
6
వాగ్దానముల్‌ నాలో నెరవేరెను
విమోచించి నాకిచ్చితివే
పాడెదను ప్రహర్షింతును
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ ||నా ఆత్మ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)