1
నిన్ను ప్రకటన సేయ నిఖిల
లోకములను - బన్నుగ జేసిన
బలుడ వీవే - ఉన్న లోకంబుల
నుడుగక కరుణా సం - పన్నతతో
నేలు - ప్రభుడ వీవే
అన్ని జీవుల నెరిగి యాహార మిచ్చుచు
నున్న సర్వజ్ఞుం - డవు నీవే
యెన్న శక్యము గాక-ఉన్న లక్షణముల
సన్నుతించుటకు నే జాలుదునా ||నన్ని||
2
పుట్టింప నీవంచు బోషింప నీవంచు
గిట్టింప నీవంచు గీర్తింతును
వట్టి పనికి మాలి - నట్టి మానవుల చే
పట్టి రక్షింప బా - ధ్యుండవంచు -
దట్టమైన కృపను - దరిజేర్చ నాకిచ్చి
పట్టయి నిలచియుండు - ప్రభుడవంచు
గట్టడచే గడ - ముట్టుదనుక నా
పట్టుకొలది నిన్ను - బ్రస్తుతింతు||నన్ని||
3
కారుణ్య నిధి వీవు కఠినాత్ముడను నేను
భూరి శుద్ధుడవీవు పాపి నేను
సార భాగ్యుడవీవు జగతిలో నాకన్న
దారిద్రుడే లేడు - తరచి చూడ
సార సద్గుణముల సంపన్నుడవు నీవు
ఘోర దుర్గుణ సం - చారి నేను
ఏ రీతి స్తుతి యింతు నేరీతి సేవింతు
నేరమెన్నక ప్రోవ - నెర నమ్మితి

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)