1
ఇదిగో నేనొక నిబంధనను
అద్భుతముల జేతున్‌
నీ ప్రజలందరి యెదుట
పరిశోధింప జాలని మహా
పనులెల్ల ప్రభువే
లెక్కలేని యద్భుతముల్‌
మక్కువతో చేయువాడు ||స్వచ్ఛం||
2
సంగీత నాదములతోడ
సీయోను పురము
సొంపుగను చేరితిమి
శాశ్వత సంతోషము మా శిరములపై వెలసెన్‌
దుఃఖము నిట్టూర్పును పోయెన్‌
మిక్కిలి ఆనందము గల్గెన్‌ ||స్వచ్ఛం||
3
నీలముల పునాదులు వేసి
నీలాంజనములతో మాణిక్యమణులతో
సువర్ణశునీయముల సూర్యకాంతముతో
ప్రశస్త రత్నములతో
ప్రవిమలముగ నిను గట్టెదను ||స్వచ్ఛం||
4
సుమముల హారము
సంతోషానంద తైలము నీదే
స్తుతివస్త్రమును నీదే
ఉల్లాస వస్త్రంబు నీదే
విడుదలయు నీదే
హితవత్సరము విముక్తి
ఆత్మాభిషేకము నీదే ||స్వచ్ఛంద||
5
జలములలో బడి దాటునపుడు
బలమై యుండెదను
నీ తోడై యుండెదను
నదులలో వెళ్లునప్పుడు నీపై పారవు
అగ్ని మధ్యను నడచినను
జ్వాలలు నిను కాల్చగలేవు ||స్వచ్ఛంద||
6
ఇత్తడి తలుపుల బగుల గొట్టెద
నినుప గడియలను
విడగొట్టెదను నేను
అంధకార స్థలములలోనున్నట్టి
నిధులను రహస్యములో
మరుగైన ధనమును
నీకొసంగెదను ||స్వచ్ఛం||
7
గర్భమున పుట్టినది మొదలు
తల్లి యొడిలోన
కూర్చుండినది మొదలు
నేను చంకబెట్టుకొన్న-నాదు ప్రజలారా
ముదిమి వచ్చువరకు నిన్ను
ఎత్తుకొనువాడను నేనే ||స్వచ్ఛంద||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)