1
పాప మమతల చేత
పారిపోయిన నాకు
ప్రాప్తించె క్షామము
పశ్చాత్తాపమునొంది
తండ్రి క్షమ గోరుదు
పంపుము క్షేమము
ప్రభు నీదు సిలువ
ముఖము చెల్లని నాకు
పుట్టించె ధైర్యము ||మార్గ||
2
ధనమే సర్వంబనుచు
సుఖమే స్వర్గంబనుచు
తండ్రిని వీడితి
ధరణి భోగములెల్ల
బ్రతుకు ధ్వంసము జేసె
దేవానిన్‌ జేరితి
దేహీయని నీవైపు
చేతులెత్తిన నాకు
దారిని జూపుము ||మార్గము||
3
దూరదేశములోన
బాగుందు ననుకొనుచు
తప్పితి మార్గము
తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల
తరిమె దారిద్య్రము
దాక్షిణ్య మూర్తి నీ దయ నాపై కురిపించి
ధన్యుని చేయుము ||మార్గము||
4
అమ్ముకొంటిని నన్ను
అధముడొకనికి నాదు ఆకలి బాధలో
అన్యాయమైపోయె పందులు సహ
వెలివేయ - అలవడెను వేదన
అడుగంటె అవినీతి మేల్కొనియె మానవత
ఆశ్రయం జూపుము ||మార్గము||
5
కొడుకునే కాదనుచు
గృహమే చెఱసాలనుచు
కోపించి వెళ్లితి
కూలివానిగనైన నీ ఇంట పనిచేసి
కనికరమె కోరుదు
కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు
క్షమియించి బ్రోవుమా ||మార్గము||
6
నా తండ్రి నను జూచి పరుగిడుచు
ఏతెంచి నాపై బడి ఏడ్చెను
నవజీమును గూర్చి ఇంటికి తోడ్కొని
వెళ్లి నన్ను దీవించెను
నా జీవిత కథయంత యేసు ప్రేమకు
ధరలో సాక్షినైయుందును ||మార్గము||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)