1
దిశలన్నియు తిరిగితిని
నా పాపపు దాహముతో
దౌష్ట్యములో మసలుచును
దౌర్జన్యము చేయుచును
ధనపీడనతో- మృగవాంఛలతో
దిగజారితి చావునకు ||ప్రభు||
2
చెండాడితి బ్రతుకులను
దహియించితి గృహములను
చెరగవు నా పాపములు
తరగవు నా వేదనలు
చనిపోయినను ధర వీడినను
చల్లారవు శోకములు ||ప్రభు||
3
పలుమారులు వినుచుంటి
నజరేయుని నీతికథ
పరిహాసము చేసితిని
పరమార్థమే మోసమని
పశుప్రాయుడనై జీవించుటచే
ప్రాప్తించెను ఈ సిలువ ||ప్రభు||
4
కలువరి ఆవరణములో
కరుణాత్ముని చేరువనే
కనుమూసిన కాలములో
వెలుగుదయించినవేళ
కనుగొంటిని నా దౌర్భాగ్య స్థితి
కంపించెను నా హృదయం ||ప్రభు||
5
యేసూ నీ రాజ్యముతో
భువికేతెంచెడి రోజు
ఈ పాపిని క్షమియించి
జ్ఞాపకముతో బ్రోవుమని
ఇలవేడితిని విలపించుచును
ఈడేరెను నా వినతి ||ప్రభు||
6
పరదైసున ఈ దినమే
నా యానందములోన
పాల్గొందువు నీవనుచు
వాగ్దానము చేయగనే
పరలోకమే నా తుదియూపిరిగా
పయనించితి ప్రభుకడకు ||ప్రభు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)