1
మార్గంబంతయు చీకటిమయము
స్వర్గ నగరికి మార్గంబెటులో
సదయా నీవే నను పట్టుకొని
సరిగా నడుపుము ప్రేమపథమున ||ఆ||
2
వసియించుము నా హృదయమునందు
వసియించుము నానయనమునందు
అన్నియు నిర్వహించుచున్నావు
నన్నును నిర్వహించుము ప్రభువా ||ఆ||
3
కలుషాత్ములకై ప్రాణము బెట్టి
కష్టము లంతరింప జేసి
కల్వరిసిలువలో కార్చిన రక్త
కాలువయందు కడుగుమునన్ను ||ఆ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)