1
జిగటగల ఊబినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను
నా పాదములకు దీపమాయెను
సత్యమైన మార్గములో నడుపు చుండెను
2
వాడిగల రెండంచుల ఖడ్గము వలెను
నాలోని సర్వమును విభజించి శోధించి
పాప మాలిన్యము తొలగించి వేయుచు
అనుక్షణము క్రొత్త శక్తి నిచ్చుచున్నది
3
శత్రువును ఎదుర్కొనే సర్వాంగకవచమై
యుద్ధమునకు సిద్ధమనస్సు నిచ్చుచున్నది
అపవాది వేయుచున్న అగ్ని
బాణములను ఖడ్గమువలె అడ్డుకొని
ఆర్పివేయుచున్నది

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)