1
లోకమంతా నాదని యెంచి
బంధుమిత్రులే ప్రియులను కొంటిని
అంతయు మోసమేగా
వ్యర్థము సర్వమును-ఇలలో ||పర||
2
ధన సంపదలు గౌరవములు
దహించి పోవు నీ లోకమున
పాపము నిండె జగములో
శాపము చేకూర్చుకొనె లోకము ||పర||
3
తెలుపుము నా అంతము నాకు
తెలుపుము నా ఆయువు యెంతో
తెలుపుము యెంత అల్పుడనో
విరిగి నలిగియున్నాను-నేను ||పర||
4
ఆ దినము ప్రభు గుర్తెరిగితిని
నీ రక్తముచే మార్చబడితిని
క్షమాపణ పొందితివనగా
మహానందము కలిగె-నాలో ||పర||
5
యాత్రికుడనే నీలోకములో
సిలువ మోయుచు సాగెదనిలలో
అమూల్యమైన ధనముగా
పొందితిని నేను-యేసుని ||పర||
6
నా నేత్రములు మూయబడగా
నాదు యాత్ర ముగియునిలలో
చేరుదున్‌ పరలోక దేశము నాదు
గానము యిదియే యిలలో ||పర||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)