1
నిన్నుఁ దెలియక మున్ను-నన్య
దైవంబుల-ననుసరించిన
పాపము-లన్ని పెనగొని నాదు
హృదయపు-గన్ను
గ్రమ్మి ప్రకాశమియ్యక-యున్న నీ
విమలాత్మ వరమున
నన్ను వెలిఁగించిన దయానిధి
2
వదలకనే జేయు-తుదలేని పాపము-
వదలించి నను
బ్రోచితి=తుది దినంబునఁ గలుగు
బాధల-దొలగ జేయుట
నీవయని నా-హృదయమందున నా
నిరీక్షణ - పదిలపరచిన భక్త పాలక
3
నీ వాక్యార్థము నాలో-నివసింపఁ జేసి
నీ-సేవకునిగ బ్రోవవే
నీవె సత్యము నీవె జీవము
నీవె మార్గము నీవె ద్వారము
నీవు గాకింకెవ్వరు లేరు - కావవే నను
యేసునాయక

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)