1
నన్ను ప్రేమింపమా
నవరూప మెత్తి
దానముగా జీవము సిల్వపై
నిచ్చి కన్న తలిదండ్రుల
యన్న దమ్ముల ప్రేమ
కన్న మించిన ప్రేమతో ||యేసు||
2
తల్లి గర్భముననే
ధరియింప బడినపుడే
దురితుండనై యుంటిని
నా వల్ల జేయ బడెడు
నెల్ల కార్యము లెప్పు
డే హ్యంబులై యుండగా ||యేసు||
3
మంచినాలో పుట్ట
దంచు నీ వెరిగినన్‌
మించి బ్రేమించి నావు
ఆహా యెంచ శక్యముగాని
మంచి నాలో బెంచ
నెంచి ప్రేమించినావు ||యేసు||
4
నన్ను బ్రేమింప నీ
కున్నకష్టములన్ని
మున్నె తెలిసి యుంటివి
తెలిసి నన్ను బ్రేమింప
నీకున్న కారణమేమో
యన్నా తెలియదు చిత్రము ||యేసు||
5
నా వంటి నరుడొకడు
నన్ను ప్రేమించిన
నా వలన ఫలము గోరు
ఆహా నీవంటి పుణ్యునికి
నా వంటి పాపితో
కేవలం బేమిలేక ||యేసు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)