1
దారుణ హింసలలో
దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో
ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో
సర్వత్ర యేసును కీర్తింతుము ||దే||
2
పరిశుద్ధాత్మునికై
ప్రార్థన సలుపుదము
పరమాత్ముని రాక
బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై
సర్వాంగహోమము జేయుదము ||దే||
3
అనుదిన కూటములు
అందరి గృహములలో
ఆనందముతోను ఆరాధనలాయే
వీనులవిందగు పాటలతో
ధ్యానము చేయుచు
మురియుదము ||దే||
4
సజీవ సిలువ ప్రభు
సమాధి గెలుచుటచే
విజేత ప్రేమికులం
విధేయ బోధకులం
నిజముగ రక్షణ ప్రబలుటకై
ధ్వజముగ సిలువను నిలుపుదము ||దే||
5
గోధుమ గింజవలె
క్రీస్తుడు చావగను
నాధుని మరణములో
శాశ్వత జీవమును
నిధులుగ పండించి తేవగను
మాధుర్య రక్షణ లభియించెను ||దే||
6
హత సాక్షుల కాలం
అవనిలో చెలరేగ
గతకాలపు సేవ
గొల్గొత గిరి చేర
భీతులలో బహురీతులలో
నూతన లోకము కాంక్షింతుము ||దే||
7
ప్రభువును చూచుటకై
ప్రజలందరు రాగ
విభు మహిమను గాంచ
విశ్వమే మముగోర
శుభములు గూర్చుచు మాలోన
శోభిల్లు యేసును జూపుదము ||దే||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)