1
సంతసమున సాగెదము
పురికొల్పుచు మనసులను
సంకటములు ఎన్నయిన
చనిపోవుటె మేలనుచు ||సువార్త||
2
సిలువను మోయుచు భుజమున్‌
చేత సువార్తల బూని
లోకమునకు చాటెదము
ప్రశాంతుండగు యేసున్‌ ||సువార్త||
3
శ్రీ యేసునికే యిలలో
జయమార్భటించెదము
జయశాలులుగా మేము
జగదేవత నొణికింతుం ||సువార్త||
4
ప్రవక్తలలో ఘనుడు
పరమున దూతలు బొగడున్‌
నేత్రముల కాయన తార
అరుణోదయ నక్షత్రం ||సువార్త||
5
చిరునగవులతో మేము
చిందింతుము రక్తమును
హృదయములు ప్రకాశించున్‌
మనసానందం బిదియే ||సువార్త||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)