1
స్తుతుల మధ్యలోన వాసంచేసి
దూతలెల్ల పొగడె దేవుడాయనే
వేడుచుండు భక్తుల మొరలు విని
దిక్కులేని పిల్లలకు దేవుడాయనే
2
ఇద్దరు ముగ్గురు నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోన
వుండెదననిన నా దేవుని
కరములు చాచి నిత్యము స్తుతించెదను
3
సృష్టికర్త క్రీస్తు యేసు నామమును
జీవిత కాలమంత కీర్తించెదను
రాకడలో ప్రభుతో నిత్యముందును
మ్రొక్కెదను కీర్తింతును పొగడెదను

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)