1
సింహాసనము నాకివ్వ క్రీస్తు
సిలువ శ్రమలను సహించెను
ముండ్ల మకుటము ధరియించి
మహిమ కిరీటం నాకిచ్చెను
అహహ హల్లెలూయ (3) ||నాజీవి||
2
సిలువ వార్త నా శక్తి సామర్థ్యం
నశించు వారికి వెఱ్ఱితనం
సిలువ వార్తను చాటెదను
సిలువను భరించెదను
అహహ హల్లెలూయ (3) ||నాజీవి||
3
సిలువ రుధిరం పాపహరణం
సిలువ యాగమే జీవనరాగం
సిలువ మరణం నా విజయం
సాతానునికపజయం
అహహ హల్లెలూయ (3) ||నాజీవి||
4
సిలువ నాథుని బలిదానం
నాదు పాప విమోచనం
అపరాధములతో చచ్చిన నన్ను
ధర బ్రతికించెను సిలువ
అహహ హల్లెలూయ (3) ||నాజీవి||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)