1
పరిశుద్ధాత్మ లేనిది
వేదాగమ
పఠన పఠనము గాదది
నెర చీకటింట సర-కులు
వెదకు రీతి ప-ల్మరు వెదకినను
నిరర్థకమైపోవును వేగఁ ||పరి||
2
పరిశుద్ధాత్మ లేనిది-వర్షము లేని
పైరు చందంబె యది
పర బోధకముల వ-ర్తితమైన పనులు
జీ-వరహితములై యనుభ
వము గానివై యుండుఁ ||పరి||
3
పరిశుద్ధాత్మ లేనిది
యేసు ప్రభుని
నెరుగు టెరుగుట గాదది
నరరూపుఁదాల్చి
దు-ర్నరుల రక్షణ కొరకు
మరణమొందిన ప్రభుని
కరుణాధికము వడయు ||పరి||
4
పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని
బ్రతుకే బ్రతుకు గాదది
దురితేచ్ఛలను గొప్ప
యురులం దగిలి భక్తి
తరిగిపోవుట కద్ది
దొరకనందున సుమ్మ ||పరి||
5
పరిశుద్ధాత్మను బొందుట అన్నిటికన్న
ప్రబలంబైన మేలిట
నెరనమ్మి మొరబెట్టు
పరమపావను డద్ది
కరుణించి నీ కొసఁగు
మరణాంత మగు దనుక ||పరి||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)