1
గురుతులెల్ల-లోకమంతా
సరిగ చూడ కాననగున్‌
పరిశుద్ధమైన ప్రవర్తనతో
ప్రభుకై కనిపెట్టుడి ||యేసు||
2
ప్రొద్దు గ్రుంకి-వచ్చునేమో
అర్థరాత్రి యందేమో
ఉదయము కోడికూతలపుడు
వచ్చునేమో కనిపెట్టుడి ||యేసు||
3
సిద్ధపడుడి-మీరిలలో
మీరు దేవుని సంధింప
సిద్ధపడుడి-తీర్పునకై
ప్రభువుకై కనిపెట్టుడి ||యేసు||
4
పరిశుద్ధులై-జీవించుడి
ప్రభుని చిత్తము చేయుడి
మరణమే యేసునందు సుమ్మా
మేలుకొని కనిపెట్టుడి ||యేసు||
5
యేసువలె-జీవించుడి
తీసివేయుడి మలినములన్‌
మోసంపుటాశ-లన్ని విడిచి
ఆశతో కనిపెట్టుడి ||యేసు||
6
వేషధారణ విడచి మీరు
యేసు ముద్రలు ధరియించి
పెండ్లి కుమారుని సంధింప
అందరు కనిపెట్టుడి ||యేసు||
7
మేఘముపై-వెళ్లిన ప్రభు
వేగముగ వచ్చు నిల
సకల శ్రమలను-భరించి
హల్లెలూయ పాడుడి ||యేసు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)