1
యేసుని రక్తమందు కడుగబడి
వాక్యముచే నిత్యం భద్ర పరచబడి
నిష్కళంక పరిశుద్ధులతో పేదన్‌ నేను
బంగారు వీధులలో తిరిగెదను
2
దూతలు వీణెలను మీటునపుడు
గంభీర జయధ్వనులు మ్రోగునపుడు
హల్లెలూయ పాటల్‌ పాడుచుండ
ప్రియయేసుతోను నేను
యుల్లసింతున్‌ ||ప్రియ||
3
ముండ్ల మకుటంబైన తలను జూచి
స్వర్ణకిరీటంబెట్టి యానందింతున్‌
కొరడాతో కొట్టబడిన వీపున్‌ చూచి
ప్రతి యొక్క గాయమును
ముద్దాడెదన్‌ ||ప్రియ||
4
హృదయము స్తుతులతో నింపబడె
నా భాగ్య గృహమును స్మరించుచుంటే
హల్లెలూయ ఆమెన్‌ హల్లెలూయ
వర్ణింప నా నాలుక చాలదయ్యా
5
ఆహా యా బూర ఎపుడు ధ్వనించునో
ఆహా నా యాశ ఎపుడు తీరుతుందో
తండ్రి నా కన్నీటిని తుడుచునెపుడో
ఆశతో వేచియుండె నా హృదయం

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)