1
సర్వకృపానిధియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదను
సంతసముగ నిను పొగడెదను
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యనిపాడెదను
ఆనందముతో సాగెదను
2
ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్ధముగ జీవించుటకై
పాపిని నను కరుణించితివి ||హ||
3
అల్పకాల శ్రమలనుభవింప
అనుదినము కృపనిచ్చితివి
నాథుని అడుగు జాడలలో
నడచుటకు నన్ను పిలిచితివి ||హ||
4
మరణ శరీరము మార్పునొంది
మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నను నింపితివి
మరణ భయములను తీర్చితివి ||హ||
5
భువినుండి శ్రేష్టఫలముగను
దేవునికి నిత్య స్వాస్థ్యముగా
భూజనములలో నుండి నను
ప్రేమించి క్రయధనమిచ్చితివి ||హ||
6
ఎవరు పాడని గీతమును
యేసుని గూర్చి పాడుటకై
హేతువు లేకయే ప్రేమించెను
యేసుకు నేనేమివ్వగలను ||హ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)