1
సంతోషముతో యెహోవాను స్తుతించుడి
ఉత్సాహ గానము చేయుచు
సన్నిధికి రండి ||సమ||
2
యెహోవా మీ దేవుడని తెలిసికొనుడి
ఆయనే మనలను కలుగజేసెను ||సమ||
3
మనము ఆయన ప్రజలమైతిమి
ఆయన మేపు గొఱ్ఱెలము నైతిమి ||సమ||
4
గుమ్మములలో కృతజ్ఞతార్పణలతోను
ఆవరణములలో కీర్తనలతో
ప్రవేశించుడి ||సమ||
5
ఆయనను స్తుతించుడి
ఆయనను స్తుతించుడి
ఆయన నామమునకు స్తుతులు
చెల్లించుడి ||సమ||
6
యెహోవా దయాళుడాయన కృప
నిత్యము ఆయన సత్యము
తరతరములుండును ||సమ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)