1
పర్వతములు కదిలిన నీ
యుర్వి మారుపడినను
సర్వమున్‌ ఘోషించుచు నీ
సంద్రముప్పొంగినన్‌
అభయ-మభయ-మభయ ||దేవుడే||
2
దేవుడెప్డు తోడుగాగ - దేశము వర్ధిల్లును
ఆ-తావునందు ప్రజలు మిగుల
ధన్యులై వసింతురు
అభయ-మభయ-మభయ ||దేవుడే||
3
రాజ్యముల్‌ కంపించిన
భూ-రాష్ట్రముల్‌ ఘోషించిన
పూజ్యుడౌయెహోవ వైరి
బూని సంహరించును
అభయ-మభయ-మభయ ||దేవుడే||
4
విల్లు విఱుచు నాయన తెగ
బల్లెము నఱకు నాయన
చెల్ల చెదర జేసిరిపుల
నెల్లద్రుంచు నాయనే
అభయ-మభయ-మభయ ||దేవుడే||
5
పిశాచి పూర్ణబలము నాతో
బెనుగులాడ జడియును
నశించి శత్రుగణముదేవు
నాజ్ఞ వలన మడియును
అభయ-మభయ-మభయ ||దేవుడే||
6
కోటయు నాశ్రయమునై యా
కోబు దేవుడుండగ
ఏటికింక వెరవవలయు
నెప్డు నాకు బండుగ
అభయ-మభయ-మభయ ||దేవుడే||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)