1
క్రీస్తుని నామము - నిత్యము నిల్చున్‌
సూర్యుడున్నంత - కాలము చిగుర్చున్‌2
2
అతనిని బట్టి - మనుష్యులెల్లరు
తమ్మును తాము దీవించుకొనెదరు
3
అన్య జను - లందరును యతని
ధన్యుడని చెప్పు - కొనుచుందురు
4
దేవుడైన - యెహోవా ఇశ్రాయేలు
దేవుడు స్తుతింప - బడును గాక
5
ఆయన మాత్రమె బహు - ఆశ్చర్య కార్య
ములు చేయువాడు గాన – స్తోత్రార్హుండు
6
ఆయన మహిమగల - నామము
నిత్యమును స్తుతింప-బడునుగాక
7
సర్వభూమి ఆయన - మహిమచే
నిండియుండును గాక - ఆమెన్‌ ఆమెన్‌

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)