1
పాప శాపములో బడియున్న
నన్ను జూచి చేయి జాచి
చక ్కగ దరికి - చేర్చితివి ||జైై||
2
సిలువ రక్తములో నన్ను కడిగి
పాపమంతా పరిహరించిన
పావనుడగు నా - ప్రభు యేసు ||జైౖ||
3
నీతి హీనుడనైన నాకు
నీతి రక్షణ వస్త్రములను
ప్రీతితో నొసగిన-నీతి రాజా ||జై||
4
మంటి పురుగునైన నన్ను
మంటి నుండి మింట జేర్చిన
మహా ప్రభుండా - నీకే జై జై ||జైై||
5
పాప శాపగ్రస్తుడనై యుండ
నన్ను గూడ నీ స్వకీయ
సంపాద్యముగా - జేసితివి ||జైౖ||
6
రాజులైన యాజక గుంపులో
నన్ను గూడ నీ సొత్తయిన
పరిశుద్ధ జనములో - జేర్చితివి ||జైై||
7
తల్లియైన మరచిన మరచును
నేను నిన్ను మరువననిన
నమ్మకమైన నా ప్రభువా ||జైై||
8
అధిక స్తోత్రార్హుడవైన
ఆది యంతము లేని దేవా
యుగాయుగములకు-నీకెే జై జై ||జై||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)