1
పిశాచి గడిమి బడగొట్టెను
దన వశాన నను నిలువ బెట్టెను
ప్రశాంత మధుర సు - విశేష వాక్ఫల
నిశాంతమున
జే - ర్చిసేద దీర్చెను ||యెహో||
2
మదావళము బోలు నామదిన్‌
దన - ప్రదీప్త వాక్యాం కుశాహతిన్‌
యధేచ్ఛలన్నిటి గుదించి పాపపు
మొదల్‌ తుదల్‌
నరి - కిదరికి చేర్చెను ||యెహో||
3
అనీతి వస్త్ర మెడలించెను
యే - సునాధు రక్తమున ముంచెను
వినూత్న యత్నమె - ద నూని యెన్నడు
గనన్‌ వినన్‌ బ్రేమనాకు చూపెను
||యెహో||
4
విలాపములకు జెవి నిచ్చెను
శ్రమ - కలాపములకు సెలవిచ్చెను
శిలానగము పై - కి లాగి నను
సుఖ - కళావళుల్‌
మన-సులోన నిలిపెను ||యెహో||
5
అగణ్య పాపియని త్రోయక న-న్ను
గూర్చి తన సుతుని దాచక
తెగించి మృతి కొప్పగించి పాపపు
నెగుల్‌ దిగుల్‌
సొగసుగా నణంచెను ||యెహోవా||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)