1
నశియించిన పాపిని నాకు
శాశ్వతమైన కృప జూపి
నా యేసుడెగా రక్షించెనుగా
నా ప్రభువును సేవింతునుగా ||ఆనం||
2
వేడుకతో విందుశాలకును
తోడుకు వెళ్లును నా ప్రియుడు
కోరిన ఫలములు తినిపించును
కూరిమితో నా ప్రియ ప్రభువు ||ఆనం||
3
ఆనందభరితనై నేను
అతని నీడను కూర్చుందును
వాడ బారను యే నాటికి నే
వరదుని బాడుచు నుండెదను ||ఆనం||
4
ఎంతో ప్రేమతో ప్రేమించె
వింతగను ప్రభు దీవించె
అంతము వరకు యేసుని చెంతనే
నుందును ఆనందముతోను ||ఆనం||
5
రాజగు యేసు వచ్చునుగా
రాజ్యము నాకు తెచ్చునుగా
రాజ్యమునందు నే రాణినిగా
రమ్యము గా నే నుందునుగా ||ఆనం||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)