1
ఎన్నెన్నో ఆపదలు-నన్ను చుట్టినను
నిన్ను తలచినచో-అన్ని విడనాడు (2)
అన్ని కాలముల-నిన్నే స్మరియింతు
ఎన్నరానివయా-నీకున్న సుగుణములు
2
నాకున్న మనుజులెల్ల-నన్ను విడిచినను
నా దేవ యెపుడైనా-నన్ను విడిచితివా (2)
నా హృదయ కలశమున
నిను నేను నిలిపెదను (2)
నీ పాదకమలముల
నా దేవ కొలిచెదను
3
నా బ్రతుకు దినములలో
నిన్నేల మరచెదను
నీ ఘనకార్యముల
నేనెపుడు స్మరియింతు (2)
నీ ఉపకారముల
నేనెపుడు తలచెదను (2)
నా యేసు పాదముల
నేనిపుడు కొలిచెదను

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)