1
పాపుల కొరకై - ప్రాణము బెట్టిన
ప్రభు నిల దలచవె యో మనసా
శాపము నంతయు - జక్కగ నోర్చిన
శాంతుని పొగడవె యో మనసా
2
కష్టములలో మన - కండగ నుండిన
కర్తను దలచవె యో మనసా
నష్టములన్నియు - నణచిన
యా గురు శ్రేష్టుని పొగడవె యో మనసా
3
మరణతరిని మన - శరణుగ నుండెడు
మాన్యుని దలచవె యో మనసా
కరుణను మన క - న్నీటిని దుడిచిన
కర్తను పొగడవె యో మనసా
4
ప్రార్థనలు విని - ఫలముల నొసగిన
ప్రభునిక దలచవె యో మనసా
వర్ధన గోరుచు - శ్రద్ధతో దిద్దిన
వంద్యుని పొగడవె యో మనసా
5
వంచన లేక - వరముల నొసగిన
వరదుని దలచవె యో మనసా
కొంచెము కాని - కూర్మితో దేవుని
కొమరుని పొగడవె యో మనసా

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)