1
యేసుతో గడిపెద
యేసుతో నడిచెద
పరమున చేరగ నే వెళ్ళెద,
హనోకు వలె సాగెదా... ||నే||
2
తల్లియే మరచిన
తండ్రియే విడిచిన
బంధువులే నన్ను వెలివేసినా
బలవంతునితో సాగెదా... ||నే||
3
వెనుక శత్రువుల్‌ - వెంటాడినను
ముందు సముద్రము ఎదురొచ్చినా
మోషేవలె సాగెదా... ||నే||
4
మరణ శాసనం - హెచ్చరించినను
సింహపు బోనులో నను వేసినా
దానియేల్‌ వలె సాగెదా... ||నే||
5
లోకపు శ్రమలు - నన్నెదిరించినన్‌
కఠినులు రాళ్ళతో హింసించినా
స్తెఫను వలె సాగెదా... ||నే||
6
బ్రతుకుట క్రీస్తే - చావయినా మేలే
క్రీస్తుకై హత సాక్షిగా మారిన
పౌలు వలె సాగెదా... ||నే||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)