1
ఏదెనులో ఆదాముతో నుండెన్‌
హనోకు తోడ నేగెను
దీర్ఘ దర్శకులతో నుండెన్‌
ధన్యులు దేవుని గలవారు ||తోడుగ||
2
దైవాజ్ఞను శిరసావహించి
దివ్యముగ నబ్రహాము
కన్న కొమరుని ఖండించుటకు
ఖడ్గమునెత్తినయపుడు ||తోడుగ||
3
యోసేపు ద్వేషించబడినపుడు
గోతిలో త్రోయబడినపుడు
శోధనలో చెఱసాలయందు
సింహాసన మెక్కినపుడు ||తోడుగ||
4
ఫరోరాజు తరిమినయపుడు
ఎఱ్ఱ సంద్రపు తీరమున
యోర్దానునది దాటునపుడు
యెరికో కూలిన యపుడు ||తోడుగ||
5
దావీదు సింహము నెదిరించి
ధైర్యాన చీల్చినయపుడు
గొల్యాతును హతమార్చినయపుడు
సౌలుచే తరుమబడినపుడు ||తోడుగ||
6
సింహపు బోనులో దానియేలు
షడ్రకు మెషాకబెద్నెగో
అగ్నిగుండములో వేయబడన్‌
నల్గురుగా కనబడినపుడు ||తోడుగ||
7
పౌలు బంధించబడినపుడు
పేతురు చెఱలోనున్నపుడు
అపోస్తలులు విశ్వాసులు
హింసించబడిన యపుడు ||తోడుగ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)