1
యేసుని వాక్యములన్నిటిన్‌
నీ హృదయములో భద్రపరచుము
బండమీద కట్టిన గృహమువలె
భద్రముగ నుందువు సంఘమా ||పరి||
2
ద్రాక్షావల్లియైన క్రీస్తులో
తీగవైన నీవు కట్టబడిన
బహుగా ఫలించుచుందువు
ఫలభరితంబుగా నుందువు ||పరి||
3
మంచి గొఱ్ఱెల కాపరియైన
యేసు కాపుదల క్రింద నీవు
దొడ్డిలో జీవించుచుండిన
తోడేళ్ళు నిన్ను జేరలేవు ||పరి||
4
వెలుగైన యేసు మార్గమును
వెంబడించుచుండుము సంఘమా
అంధకార క్రియలు నీవు చేయవు
వెలుగు బిడ్డవై తేజరిల్లుమా ||పరి||
5
పునరుత్థాన జీవమైన క్రీస్తున్‌
పూర్ణమనస్సుతో ప్రేమించు
నీతిమంతుల పునరుత్థానములో
నిత్యజీవములో నివసింతువు ||పరి||
6
సత్యమూర్తియైన క్రీస్తేసు
శ్రీఘ్రముగా రానైయుండె
సంధించుటకు శక్తి కొరకు
సత్యమార్గములో నడువు సంఘమా ||పరి||
7
సత్య సంఘంబు లన్నియున్‌
సత్య గ్రంథంబు చొప్పున
జీవించవలెనని కోరి
జీవమిచ్చి పోయె నేసు క్రీస్తు ||పరి||
8
శ్రమలెన్నో సంఘము పైకి
బహు శ్రీఘ్రముగ రానైయుండె
హల్లెలూయ స్తోత్రములతో
ఆనందించుచు ముందుకు సాగు ||పరి||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)