1
సూర్యుడు నలుపయ్యే రోజు
చంద్రుడు ఎరుపెక్కే రోజు
భూకంపం కలిగే రోజు
దిక్కులేక అరిచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాధుడు లేడు ||అదే||
2
వ్యభిచారులు యేడ్చేరోజు
మోసగాళ్ళు మసలే రోజు
అబద్ధికులు అరచే రోజు
దొంగలంతా దొర్లే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాధుడు లేడు ||అదే||
3
పిల్ల జాడ తల్లికి లేక
తల్లి జాడ పిల్లకు రాక
చెట్టుకొక్కరు పుట్టకొక్కరై
అనాధలై అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాధుడు లేడు ||అదే||
4
ఓ మనిషి యోచింపవా
నీ బ్రతుకు ఎలా ఉన్నదో
బలము చూచి భంగ పడకుమా
ధనము చూచి దగా పడకుమా
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాధుడు లేడు ||అదే||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)