1
మిగుల ఆస్థి - అధిక విద్య
పలుకుబడి ఎంతో ఉండినను
సిలువన్‌ జూడ - నాదు సర్వ
గర్వమంతయు వ్యర్థంబేను ||క్రీస్తు||
2
జీవపూట - నీదు సిలువ
జీవనది లోక మంతటికి
శుద్ధ రక్త - ఊటలోన
మునిగి నేను - శుద్ధుడనైతిన్‌ ||క్రీస్తు||
3
కాలు సేతుల్‌ - శిరము నుండి
చిందుచుండె రక్తంబదిగో
యేసు రాజా! ఇట్టి ప్రేమ
నాదు బ్రతుకున గాంచలేదు ||క్రీస్తు||
4
ఇంత వింత ప్రేమ కొరకై
యేమి కానుక చెల్లించెదను
కోటి యాస్తుల్‌ సాటి కావు
నన్ను నేను సమర్పింతు ||క్రీస్తు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)