1
సీయోను సంతసించు
పరమానందము నీకు లభించె గాన
సీయోను సంతసించు
రక్షకుడేసుని - మనసార మ్రొక్కి
పరవశమొందు-ధన్యత నిచ్చిన ||కర్తా||
2
కన్నార చూచితిమి - దైవ రక్షణను
రుచియించి యెరిగితి
కన్నార చూచితిమి
లెక్కింపలేని - కృపలతో నిన్ను
దర్శించి - దీవింప నిశ్చయించిన||కర్తా||
3
పవిత్ర సంఘమా - యేసు వెదకి
వెంటాడి స్వంతము చేసిన
పవిత్ర సంఘమా
సత్తులేకుండా - పడియున్న నీకు
రక్తము నిచ్చి - జీవింపజేసిన ||కర్తా||
4
అన్యురాలా! సీయోనూ! - నిన్ను
తృణీకరించక చేతనెత్తికొనె
అన్యురాలా! సీయోనూ!
యేసుని నీతి - ధరింప జేసి పెండ్లి
కుమార్తె సౌందర్యమిచ్చిన ||కర్తా||
5
శృంగార కన్యలారా! - పరిశు...ద్ధ
గానముతో స్తుతించుడి
శృంగార కన్యలారా!
సాటి లేని - పెండ్లి కుమారుడేసుని
మహిమ పరచు-భాగ్యంబు నొసగిన

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)