1
ఇహపరమున మేలైన నామము
శక్తి గలిగి నట్టి నామమిది
పరిశుద్ధులు స్తుతించు నామమిది
పరి... ||యేసు||
2
సైతానున్‌ - పాతాళమును జయించు
వీరత్వము గల నామమిది
జయమొందెదము ఈ నామమున
జయ... ||యేసు||
3
నశించు పాపుల రక్షింప లోక
మున కేతెంచిన నామమిది
పరలోకమున చేర్చు నామమిది
పర... ||యేసు||
4
ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు
ఉన్నత దేవుని నామమిది
లోకమంతా ప్రకాశించు నామమిది
లోక... ||యేసు||
5
శోధన గాధల కష్ట సమయాన
ఓదార్చి నడుపు నామమిది
ఆటంకము తీసివేయు నామమిది
ఆటం... ||యేసు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)