1
ఆగమ్య ఆనందమే
హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు
స్తుతికి యోగ్యములు
స్తుతికి యోగ్యములు ||ఓయేసు||
2
సంకట సమయములో
సాగలేకున్నాను
దయచూపు నా మీద
అని నేను మొఱ్ఱ పెట్టగా
వింటినంటివి - నా మొఱ్ఱకు ముందే
తోడు నుందు నంటివి
తోడు నుందు నంటివి ||ఓయేసు||
3
మరణాంధకారంపు
లోయనే సంచరించినా
నిరంతరము యేసు
నాదు కాపరియై
కరము నిచ్చి నన్ను
కాయుచు నడుపును
కరుణ గల ప్రభువా
కరుణ గల ప్రభువా ||ఓయేసు||
4
కొదువ లెన్నియున్న
భయపడను నే నెపుడు
పచ్చిక బయలులో
పరుండ జేయును
భోజన జలములతో
తృప్తి పరచుచు
నాతో నుండు యేసు
నాతో నుండు యేసు ||ఓయేసు||
5
దేవుని గృహములో
సదా స్తుతించెదను
సంపూర్ణ హృదయముతో
సదా భజించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు
హల్లెలూయ ఆమెన్‌
హల్లెలూయ ఆమెన్‌ ||ఓయేసు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)