1
మహోన్నతుడా - నీ నామమును
స్తుతించుటయే బహు మంచిది
హల్లెలూయ - హల్లెలూయ
హల్లెలూయ- హల్లెలూయ
2
విలువైన రక్తము - సిలువలో కార్చి
కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను
3
ఎంతో గొప్ప - రక్షణ నిచ్చి
వింతైన జనముగ - మము జేసెను
4
మా శైలము - మా కేడెము
మా కోటయు - మా ప్రభువే
5
ఉన్నత దుర్గము - రక్షణ శృంగము
రక్షించువాడు - మన దేవుడు
6
అతి సుందరుడు - అందరిలోన
అతికాంక్షనీయుడు-అతి ప్రియుడు
7
రాత్రింబవళ్ళు - వేనోళ్ళతోను
స్తుతించుటయే - బహుమంచిది

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)