1
ముదముతో నిర్మాణకుండగు
మూల కర్తను బాడరే
వదన మీక్ష్మాన్వంచి దేవుని
వందనముతో వేడరే ||సర్వ||
2
వేదపారాయణము సేయుచు
విశ్వమంత జయింపరే
సాదరముగా దేవునిక మీ
స్వాంతమున బూజింపరే ||సర్వ||
3
ఎదను విశ్రాంతిన్‌ పరేశుని
హెచ్చుగా నుతిసేయరే
సదమలంబగు భక్తితో మీ
సర్వ మాయన కీయరే ||సర్వ||
4
చావు పుట్టుక లేనివాడుగ
సతతము జీవించును
ఈవులిచ్చుచు దన్ను వేడుమ
హేష్టులను రక్షించును ||సర్వ||
5
దాసులై దేవునికి నెదలో
దర్పమును బోగాల్పరే
యేసు క్రీస్తుని పుణ్యవస్త్రము
నే మరక మైదాల్పరే ||సర్వ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)