1
వేలాది నదులంత విస్తారతైలము
నీకిచ్చినా చాలునా
గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని
నీకిచ్చినా చాలునా ||నీవు||
2
మరణ పాత్రుడనైయున్న నాకై
మరణించితివి సిలువలో
కరుణ చూపి నీ దివ్య మార్గాన
నడిపించుమో యేసయ్యా ||నీవు||
3
విరిగి నలిగిన బలియాగముగను
నా హృదయమర్పింతును
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను ||నీవు||
4
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నేనేమి చెల్లింతును
కపట మనస్సు లేకుండ హృదయాన్ని
నీకిచ్చినా చాలునా ||నీవు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)