1
నా పాపము బాప
నరరూపివైనావు
నా శాపము బాప
నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన
దేవుడవు నీవే
నా స్థానములో నీవే ||ఎందుకో||
2
నీ రూపము నాలో
నిర్మించియున్నావు
నీ పోలికలోనే
నివసించుచున్నాను
నీవు నన్ను యెన్నుకున్నావు
నీ కొరకే నీ కృపలో ||ఎందుకో||
3
నా శ్రమలు సహించి
నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి
నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నన్ను దాచియున్నావు ||ఎందుకో||
4
నీ సన్నిధి నాలో
నా సర్వము నీలో
నీ సంపద నాలో
నా సంతసము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనందువే ||ఎందుకో||
5
నా మనవులు ముందే
నీ మనస్సులో నెరవేరె
నా మనుగడ ముందే
నీ గ్రంథములో నుండె
ఏమి అద్భుత ప్రేమ-సంకల్పం
నేనేమి చెల్లింతు ||ఎందుకో||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)