1
నీ తోడు లేక నీ ప్రేమ లేక
యిలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా ||ఎ||
2
నా యింటి దీపం నీవే అని తెలిసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమలో ప్రభువా ||ఎ||
3
ఆపదలు నన్ను వెన్నంటియున్న
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయు నన్ను విడిచిన (2)
నీ నుండి వేరు చేయవు ప్రభువా ||ఎ||
4
నా స్థితి గమనించి నన్ను ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి
నీదు యాగమే నా మోక్ష భాగ్యము
నీ యందే నిత్య జీవము ప్రభువా ||ఎ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)