1
యెరూషలేము యెహోవయె
కట్టుచున్న వాడని
ఇశ్రాయేలీయులను
ప్రోగు చేయువాడని ||దేవునికి||
2
గుండె చెదరిన వారిని
బాగుచేయువాడని
వారి గాయములన్నియు
కట్టుచున్న వాడని ||దేవునికి||
3
ప్రభువు గొప్పవాడును
అధికశక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే
మితియు లేని వాడని ||దేవునికి||
4
దీనులకు అండాయనే
భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని
స్తుతులతో కీర్తించుడి ||దేవునికి||
5
గుఱ్ఱముల నరులందలి
బలము నా నందించడు
కృపకు వేడువారిలో
సంతసించువాడని ||దేవునికి||
6
యెరూషలేమ యెహోవాను
సీయోనూ నీ దేవుని
కీర్తించుము కొనియాడుము
ఆనందించువాడని ||దేవునికి||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)