1
లేత వయసు నడి ప్రాయమును
గతించిపోవునవి - గనుక నీదు
హృదయములో - వ్యాకులమును
తొలగించుకొనుము - యువకుడా
వినుము ||యౌవ||
2
దుర్దినములు రాబోకముందే
వీటియందిపుడు
సంతోషము లేదని యెడు
సంవత్సరములు రాబోక ముందే
చెడుగును విడుమా ||యౌవ||
3
పశ్చాత్తాపమున పాపములను
ఒప్పుకొనుచు నేడే
రక్షణార్థము రక్షకుడేసును
రయమున క్షమాపణ వేడిన
రక్షణ నీదే ||యౌవ||
4
మన్నయినది వెనుకటి వలెనే
మంటిలో కలియున్‌
ఆత్మ దాని దయచేసిన
దేవుని సన్నిధికి మరల
వెళ్ళును యౌవనుడా ||యౌవ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)