1
బయలుపడు ప్రతి వాని క్రియలు
కర్ర గడ్డి కొయ్యకాలైనను
వెండి బంగారము విలువ రాళ్ళైనను
అగ్నియే తేల్చును (2) ||కా||
2
పందెమందు నీకు పాలున్నదా
పొందువాడొక్కడే బహుమతిని
యోధుడవై మంచి బుద్ధిని కలిగిన
వాడబారని(2) కిరీటమొందెదవు ||కా||
3
ఆత్మల కొరకై భారమున్నదా
ఫలితమున్నదా నీ సేవలో
ప్రభుని రాకలో అందరి ఎదుట
ఆనందమహిమ(2)
కిరీటమొందెదవు ||కా||
4
సంఘము నడిపే సేవకుడా
మందను నడుపుము ప్రేమతోడ
ఆదర్శుండవై మందను కాచిన
మహిమ కిరీటం (2)
నీవు పొందెదవు ||కా||
5
మంచి పోరాటము పోరాడుము
కాపాడుకొను విశ్వాసమును
తన ప్రత్యక్షత నపేక్షించుము
నీతి కిరీటము (2)నీకివ్వబడును ||కా||
6
భక్తితో బ్రతుక గోరినచో
సిద్ధపడు పొంద హింసలను
అంతము వరకు నమ్మిక యుంచిన
జీవకిరీటము (2) పొందెదవెరుగు ||కా||
7
దయచేయు శ్రేష్టదీవెనలు
అంగీకరించు నీ ప్రార్థనలు
ప్రార్థనయందు మేల్కొని యుండుము
స్వర్ణ కిరీటము (2)
ధరియింపజేయును ||కా||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)