1
నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము
నీ న్యాయవిధులు నాకాహారం
హల్లెలూయా-హల్లెలూయా
హల్లెలూయా - హల్లెలూయా
నాథుడేసు క్రీస్తు రాజుకు హల్లెలూయా
2
మారని వాక్యము ఆరని దీపము
అనాది దేవుని వాగ్దానము ||హ||
3
జుంటి తేనియల వంటి ప్రవాహము
కంటె మరికమ్మని మింటి వాక్యం ||హ||
4
నరరూపమెత్తిన పరలోక వాక్యమా
నాతో మాట్లాడుమా నా ప్రభువా ||హ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)