1
కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసే
కలుషహరా కరుణించితివి (2) ||భా||
2
దోషము చేసితి నేనే గదా
మోసముతో బ్రతికిన నేనే గదా
మోసితివా నా శాప భారం (2) ||భా||
3
పాపము జేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి (2) ||భా||
4
నీ మరణపు వేదన వృధాగాదు
నా మది నీ వేదనలో మునిగే
క్షేమము కలిగెను
హృదయములో (2) ||భా||
5
ఎందులకో నా పై యీ ప్రేమ
అందదయా - స్వామి నా మదికి
అందులకే భయమొందితిని (2) ||భా||
6
నమ్మిన వారిని కాదనవనియు
నెమ్మది నొసగెడునా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను (2) ||భా||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)