1
పాపపు తిమిరము బాపగను
అగాధములపై అల్లాడి
ప్రధమ మానవుని నాసికలో
నడయాడిన వూపిరిగా
ప్రభవిల్లిన యా పరిశుద్ధాత్మ
తండ్రి కుమారుల బహుమానం ||పర||
2
దేవోక్తి దాయిని-ఉజ్జీవ వాహినీ
ధరా తలముపై
సజీవ దేవుని శక్తి రూపిణి
దేశము నందలి లోయలలో
ఎండిన శల్య సమూహముపై
దేశపు పునరుత్థానముకై
ప్రసరిల్లిన జీవాత్మా
ధీమతులగు సైనికులుగ మార్చిన
పరిశుద్ధాత్మయె ప్రభు దానం ||పర||
3
అభిషేక తైలమై-విమలాత్మ జ్వాలయై
విశేష వరముల
నొసంగి బ్రోచెడు క్షేమమాలయై
ఆముష్మిక యాభరణములౌ
ఆత్మ ఫలములతో తులతూగి
అలరారగ మన హృదయ నివాసిగ
జీవించెడి యాత్మ
ఆంతర్యములో యేసుని రూపము
అలవర్చుట దైవాత్మ క్రియ ||పర||
4
సంతోష దాతయై-సహవాస జ్యోతియై
సహోదరులకిల సహాయమొసగెడి
రక్షరేఖయై
సంఘమనే ప్రభు వధువునకు
సమస్త శోభలు సమకూర్చి
శుభ కార్యముకై-ప్రభు రాకడకై
వీక్షించెడి యాత్మ
సతతము విజ్ఞాపనమును సలిపెడి
పరిశుద్ధాత్మయె మన భాగ్యం ||పర||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)