1
మించి పొంతి పిలాతు సత్యమొ
కించుకైనఁదలంప కక్కట
వంచనను గొట్టించి యూదుల
మంచితనమే కోరి యప్ప-గించెనా
మేలు గ-ణించెనా
ఇతనిగాంచి కాంచి భక్తులెట్లు
స హించిరో పరికించి మీరిది ||చూడరే||
2
మంటికిని నాకాశమునకును
మధ్యమున వ్రేలాడుచుండగ
నంటఁగొట్టగ సిలువ మ్రాని
కప్పగించుటకొరకు నిన్ను ఁగాంచెనా
యిది మది నెంచెనా హానా-కంట
నే నిటువంటి యాపదఁగంటిఁ
బ్రాణములుండునే యికఁ ||చూడరే||
3
ఊటగా రక్తంబు కారుచు
నుండ బల్లెపుఁ బ్రక్కపోటు
మాటిమాటికిఁ జూడ దుఃఖము
మరలునే తలమీద ముళ్ళకిరీటమా
యితనికి వాటమా
యూదులు మోటులై బాహాటమున నీ
పాటులను గాటముగ జేసిరి ||చూడరే||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)